వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్: ఎన్ఎంసీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ దరఖాస్తుల పునఃప్రారంభం

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

సాంకేతిక సమస్యల కారణంగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ దరఖాస్తు చేసుకోలేకపోయిన వైద్య విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ వెసులుబాటు కల్పించిందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు అక్టోబర్ ఏడో తేదీ సాయంత్రం ఆరు గంటలలోపు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో గడువు ముగిసినప్పటికీ, విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.