సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్ పీఏపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే బండారి

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై మాస్కులు ధరించిన దుండగులు దాడి చేయడంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌లోనే దాడులు జరిగితే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.