రాష్ట్రంలో ఎన్నికల అక్రమాలపై ఎస్ఈసీ కార్యాలయం వద్ద వైకాపా నిరసన

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయవాడ

రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగలేదని, ఏకపక్షంగా జరిగిన పోలింగ్ను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయం ఎదుట వైకాపా నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఆందోళన సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం కార్యాలయం తెలుగుదేశం పార్టీకి బ్రాంచ్ ఆఫీసులా మారిందని, ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.