యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్మాణ ప్రగతిలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు కలెక్టర్ రాజన్న సిరిసిల్ల వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే పనుల్లో వేగం పెంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.