సన్ ఆఫ్ కనకదుర్గమ్మ: అమ్మవారి అవతారంలో నటి లయ ఫస్ట్ లుక్

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

నిధి అన్వేషణ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం సన్ ఆఫ్ కనకదుర్గమ్మ అని చిత్రబృందం వెల్లడించింది. దుర్గ ఫణిందర్ దర్శకత్వంలో లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నదత్ విడుదల చేశారు. ఇందులో లయ అమ్మవారి రూపంలో శక్తివంతంగా కనిపిస్తున్నారని, విజువల్స్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటాయని వారు పేర్కొన్నారు.