రోడ్లు వేసిన తర్వాత టెండర్లు: అధికారుల తీరుపై మువ్వల శ్రీనివాసరావు మండిపాటు

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసిన తర్వాత టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.