ఈ-కామర్స్ పండుగ సేల్స్ డల్: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల్లో భారీ క్షీణత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
ఈ ఏడాది పండుగ సీజన్ ఈ-కామర్స్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో మొదలు కాలేదని డేటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్స్ ధరలు పెరగడం, జీఎస్టీ కోత లేకపోవడంతో తొలి విడత సేల్స్‌లో రూ. 29,800 కోట్ల నుంచి రూ. 30,900 కోట్ల మధ్య మాత్రమే అమ్మకాలు నమోదైనట్లు సంస్థ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇవి ఏడు నుంచి పది శాతం తక్కువని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.