రైతులకు సాగునీరు అందించేలా కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, భద్రత ప్రమాణాల్లో ఎక్కడా రాజీపడకుండా నవంబర్ నెల నుంచే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించి 2027 వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు.