రాష్ట్రంలో రెండో విడత టెట్ నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం రెండో విడత టెట్ నోటిఫికేషన్ను అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను మెరుగుపరచడం మరియు వారికి సకాలంలో పదోన్నతులు కల్పించే లక్ష్యంతో ఈ ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొదటి విడత టెట్ ఫలితాలను విడుదల చేశామని, అర్హత సాధించని ఉపాధ్యాయులు ఈ రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.