నా ఆస్తులపై దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కేసీఆర్కు రేవంత్ సవాల్

రిపోర్టర్: హరి స్థలం: రాజన్న సిరిసిల్ల

సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్కు దమ్ముంటే తన ఆస్తులపై బహిరంగంగా శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. హైటెక్ సిటీ సమీపంలోని స్టార్ హోటళ్లు కేసీఆర్ కుటుంబానికి చెందినవి కావని నిరూపిస్తే తన పేరు మార్చుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్కు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన తీవ్రంగా నిలదీశారు.