రాష్ట్రపతి ఏడీసీగా విధులు, పెళ్లిని త్యాగం చేసిన ఆర్మీ అధికారి!
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
భారత రాష్ట్రపతికి ఏడీసీగా సేవలందించిన రిషభ్ సింగ్ సాంబ్యాల్ తన సర్వీసు విశేషాలను పంచుకున్నారు. ఈ పదవిలో ఉన్నంత కాలం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి, వివాహం కూడా చేసుకోలేదని ఆయన తెలిపారు. విధులే సర్వస్వంగా భావించి కఠినమైన నిబంధనలకు కట్టుబడి పని చేసినట్లు పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆర్మీకి రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఈ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.