'నారా లోకేష్ పర్యటన విజయవంతం': వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

రిపోర్టర్: శివ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోవూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటనను పురస్కరించుకుని నిర్వహించిన భారీ ర్యాలీ మరియు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలను ఘనవిజయంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములైన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మరియు నాయకులకు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ శ్రేణుల సమష్టి కృషితోనే ఈ కార్యక్రమం అద్భుత విజయవంతం అయిందని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.