సోనియా గాంధీ పౌరసత్వంపై రివిజన్ పిటిషన్‌ను విచారించాలన్న దిల్లీ కోర్టు

రిపోర్టర్: రాము స్థలం: ిల్లీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి దిల్లీ కోర్టులో ఊరట లభించలేదు. 1983లో భారత పౌరసత్వం పొందేందుకు ముందే 1980లో ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చారన్న ఆరోపణలపై గతంలో మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను దిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసును తిరిగి విచారించాలని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఆదేశించారు. అడ్వకేట్ వికాస్ త్రిపాఠి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను అనుమతించిన కోర్టు, చట్టపరమైన నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.