కావలిలో ఓటర్ల జాబితా తయారీలో తీవ్ర నిర్లక్ష్యం: అధికారులపై మండిపాటు
రిపోర్టర్: హరి
స్థలం: నెల్లూరు
కావలి పట్టణంలో త్వరలో జరగనున్న పుర ఎన్నికల ఓటర్ల జాబితాల తయారీలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలతో పాటు అధికార పక్షం నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కులాల నమోదులో తప్పులు దొర్లాయని, కొన్ని వార్డుల జాబితాలు ఇంకా వెలుపలకు రాలేదని భవానీప్రసాద్ వంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా జాబితాలు రూపొందించి ఓటర్లకు అందుబాటులో ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.