మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసిన మున్సిపల్ చైర్ పర్సన్
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
పర్యావరణాన్ని, జలవనరులను కాపాడుకోవడానికి వినాయక చవితి పండుగకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి, పూజించాలని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహిళా కౌన్సిల్ సభ్యులు, సిబ్బందితో కలిసి మట్టి గణపతి విగ్రహాలను తయారు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పురాణాల ప్రకారం పార్వతీ దేవి మట్టితోనే గణపతిని తయారు చేసి ప్రాణ ప్రతిష్ట చేసిందని కాబట్టి మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని, సానుకూల శక్తి లభిస్తుందని అన్నారు.