'పీఏలు, పీఆర్ఓలపై దాడి అన్యాయం': హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ సిబ్బంది

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్ఓ మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్‌లపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధితుల తరఫున హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తీరును, అధికార పార్టీ వేధింపులను ప్రశ్నిస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమపై భౌతిక దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.