దారుణం: పెళ్లికి ఒత్తిడి చేసిందని మహిళా ఉపాధ్యాయురాలిని హతమార్చిన మేనేజర్

రిపోర్టర్: రాము స్థలం: Deoria

ఉత్తరప్రదేశ్ లోని దేరియా జిల్లాలో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందనే కోపంతో ఒక ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలిని మేనేజర్ అత్యంత క్రూరంగా గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు విజయ్ నిషాద్ బాధితురాలు రాణి విశ్వకర్మను కారులో హత్య చేసి, మృతదేహాన్ని గంటల తరబడి డిక్కీలో దాచిపెట్టి ఆ తర్వాత పాఠశాల సమీపంలో పడవేసి పరారయ్యాడని ఎస్పీ అభిజిత్ శంకర్ తెలిపారు.