జాల గ్రామానికి హెచ్పీ గ్యాస్ రాక రెండేళ్లుగా ప్రజల నరకయాతన
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం జాల గ్రామానికి హెచ్పీ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ మార్పు కారణంగా గత రెండేళ్లుగా సిలిండర్లు అందక నిత్యం ఐదు కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని, అధికారులు తక్షణమే స్పందించి క్రమం తప్పకుండా గ్యాస్ సరఫరా జరిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.