రాష్ట్రంలో పెరిగిన విదేశీ మద్యం ధరలు: నేటినుంచే అమల్లోకి నూతన రేట్లు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
రాష్ట్రంలో విక్రయించే విదేశీ మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. సగటున ఆరు శాతం వరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టెండర్ కమిటీ సిఫారసుల మేరకు బ్రాండ్‌ను బట్టి ఫుల్ బాటిల్‌పై ముప్పై నుంచి వంద రూపాయల వరకు ధరలు పెరిగాయి. సవరించిన రిటైల్ ధరలు ఈ నెల పన్నెండో తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది.