గాయత్రి పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభమంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: మహేష్
స్థలం: సూర్యాపేట
గాయత్రి పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నీటి విడుదల ద్వారా వివిధ ప్రాంతాల తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయని ఆయన తెలిపారు. కాగా, ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం పారదర్శకతతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. నీటి పారుదల రంగానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొంటూ, ఈ కీలక అంశంపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.