విజయనగరం కస్పా పాఠశాలకు టాయిలెట్ ఎయిర్ ప్యూరిఫైయర్లు అందజేత

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

విజయనగరం నగరపాలక సంస్థ కస్పా పాఠశాల అభివృద్ధికి పీ-4 పథకంలో భాగంగా దాత రఘువీర్ సమకూర్చిన రూ. 1,20,000 విలువైన 200 టాయిలెట్ ఎయిర్ ప్యూరిఫైయర్లు మరియు నీటి స్వచ్ఛత పరికరాన్ని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు శనివారం అందజేశారు. పేదలకు ఆర్థిక చేయూతనివ్వడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.