ఏపీలో చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డులు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీలో కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులకు శుభవార్త తెలిపింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల భారం తగ్గించేందుకు పీఎం స్వనిధి లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డులు అందించనుంది. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పరిమితితో ఈ కార్డులు జారీ చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి 'లోక కల్యాణ మేళా' ద్వారా ఈ రుణాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.