జాతీయ బాలల సాంస్కృతిక సదస్సులో ప్రతిభ చాటిన ఏపీ విద్యార్థినులు

రిపోర్టర్: మహేష్ స్థలం: గరివిడి

దిల్లీలో జాతీయ బాలభవన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ బాలికలు తమ నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. గరివిడి, చీపురుపల్లి ప్రాంతాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఈ వేడుకలో పాల్గొని కూచిపూడి ప్రతిభ చాటారని నిర్వాహకుడు సుంకరి రమేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల నుంచి బాలలు ఈ వేడుకలకు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. భారతీయ వారసత్వ సందేశంతో ఈ ప్రదర్శన ఇచ్చినట్లు తెలిపారు.