అన్నవరం వన దుర్గ అమ్మవారి ఆలయంలో వైభవంగా చండీ హోమం

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: శంఖవరం

శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో సత్యదేవుని సన్నిధిలో కొలువై ఉన్న శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు అర్చకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.