స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
రిపోర్టర్: AHMED
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు విచ్చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు హెలిప్యాడ్ వద్ద సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
యోగి ఆదిత్యనాథ్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు హెలిప్యాడ్ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.