తమిళనాడులో సంచలనం: ఉపఎన్నికల్లో రెండు స్థానాలు కైవసం చేసుకున్న టీవీకే

రిపోర్టర్: అశోక్ స్థలం: తమిళనాడు

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ధరాపురం, మధురాంతకం స్థానాలను కైవసం చేసుకుని ప్రత్యర్థులకు భారీ షాకిచ్చింది. ధరాపురం నియోజకవర్గంలో పీ సత్యభామ, మధురాంతకంలో కే మరకతం కుమారవేల్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.