మహిళా పారిశ్రామికవేత్తలకు భారీ ఊరట: ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసిన సర్కార్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
మహిళా పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపారులకు పెట్టుబడులు, మార్కెట్లు అందుబాటులోకి తేనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సచివాలయంలో జరిగిన ఈ కౌన్సిల్ తొలి సమావేశంలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై చర్చించారు. మహిళా వ్యాపారవేత్తలకు తగిన విధానపరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.