రాజపల్లె బతుకమ్మ సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్డీవో ఎదుట ఆందోళన

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట మండలంలోని రాజపల్లె గ్రామ ప్రజలు బతుకమ్మ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయం ఎదుట భారీ ఆందోళన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు, మహిళలు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు.