అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ను ముంచెత్తిన వరద నీరు

రిపోర్టర్: నరేష్ స్థలం: పార్వతీపురం మన్యం

అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ను వరద నీరు ముంచెత్తినట్లు సంధ్య రాణి పార్వతీపురం వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, పంట పొలాలు అలాగే ఇళ్లను స్వయంగా పరిశీలించానని పేర్కొన్నారు. బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించి, దెబ్బతిన్న మౌలిక వసతులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు.