తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులపై ప్రభుత్వాల ప్రకటన
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విద్యార్థులకు దసరా సెలవుల షెడ్యూల్ను ప్రభుత్వాలు ప్రకటించాయి. తెలంగాణలో బతుకమ్మ మరియు దసరా పండుగలను పురస్కరించుకుని అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు మొత్తం 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, అక్టోబర్ 23 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.