ఆస్ట్రేలియా సంస్థతో ఖనిజ రంగ సహకారంపై జీ కిషన్ రెడ్డి కీలక చర్చలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
ఆస్ట్రేలియాకు చెందిన సిస్రో సంస్థ ప్రతినిధులతో సమావేశమైనట్లు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. భారత్ లోని మైనింగ్ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థలతో ఆ సంస్థ దీర్ఘకాలిక సహకారంపై చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కీలక ఖనిజాల రంగంలో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించే దిశగా ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.