ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక ప్రణాళిక
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో 2026-2027 ఖరీఫ్ సీజన్లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో అక్టోబర్ మొదటి వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించారు. రవాణాలో పారదర్శకత కోసం జీపీఎస్ ట్రాకింగ్, నిల్వల కోసం ఎస్హెచ్టీ విధానం అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.