హైదరాబాద్‌ను బ్లూ, గ్రీన్ సిటీగా మారుస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌ను బ్లూ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు శాసనసభలో ప్రకటించారు. రాబోయే 30 ఏళ్ల అవసరాల కోసం కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లును ప్రవేశపెట్టామని తెలిపారు. జీహెచ్‌ఎంసీని ట్రై కార్పొరేషన్లుగా విభజించి, మూసీ పునరుజ్జీవానికి భారీగా నిధులు కేటాయించామని వెల్లడించారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.