గణనాథుడికి 100 రకాల పిండివంటల నైవేద్యం
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం కస్పా ఆర్యవైశ్య సంఘ భవనంలో వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి సుమారు 100 రకాల పిండి వంటలను భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించారు. అంతకుముందు మహిళలు ప్రత్యేకంగా కుంకుమ పూజలు జరిపారు. సంఘం అధ్యక్షులు వెత్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది భక్తులతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.