ఖమ్మంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల ప్రారంభంపై కలెక్టర్ ప్రకటన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో హ్యామ్ రోడ్లకు సంబంధించి 10 పనులకు రూ.36.60 కోట్లు మంజూరైందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అటు ఖమ్మంలో ఏడు కొత్త సబ్జెస్టేషన్లు ప్రతిపాదించామని, వాటికి అవసరమైన భూములు కేటాయించామన్నారు. భూగర్భవిద్యుత్ కేబుళ్ల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించామన్నారు.