నామినేషన్ల వివాదం: హైకోర్టును ఆశ్రయించిన నగరి మున్సిపల్ వైయస్సార్సీపీ అభ్యర్థి
రిపోర్టర్: కిరణ్
స్థలం: నగరి
నగరి మున్సిపాలిటీ ఎన్నికల్లో తన నామినేషన్ను అధికారులు అన్యాయంగా తిరస్కరించారంటూ హైకోర్టును వైయస్సార్సీపీ అభ్యర్థి పి. బాలకృష్ణన్ ఆశ్రయించినట్లు తెలిపారు. రిటర్నింగ్ అధికారి మొదట తన నామినేషన్ను ఆమోదించి లిఖితపూర్వక డిక్లరేషన్ ఇచ్చినా, తదనంతరం దానిని రద్దు చేయడం ఏకపక్షమని పేర్కొన్నారు. అధికారుల తీరుపై అత్యవసర విచారణ కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ను చట్టబద్ధంగా ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు బాలకృష్ణన్ స్పష్టం చేశారు.