రాప్తాడు బాలికపై దాడి ఘటన: వైద్య చికిత్సలపై మంత్రి నారా లోకేశ్ అప్డేట్

రిపోర్టర్: మహేష్ స్థలం: రాప్తాడు

ఆంధ్రప్రదేశ్ లోని రాప్తాడులో దారుణ దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో నిర్వహించిన ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలు విజయవంతమైనట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను పీఐసీయూకు తరలించి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, బాలిక కోలుకునే వరకు ప్రభుత్వం కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడనున్నారు.