హైదరాబాద్లో ఎన్నారై ఆస్తుల టార్గెట్గా భారీ మోసం: నకిలీ పత్రాల ముఠా అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైల విలువైన స్థిరాస్తులను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల ఆస్తులను కబ్జా చేస్తున్న భారీ మోసపూరిత ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వెల్లడించారు. ఎల్బీనగర్ పరిధిలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, నకిలీ స్టాంప్ పేపర్లు, జీపీఏ పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్వోటీ అధికారులు తెలిపారు. ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.