హర్యానాలో తల్లి ఒడిలో ఉన్న ఆరు నెలల పసికందుపై పెంపుడు కుక్క భీకర దాడి
రిపోర్టర్: అశోక్
స్థలం: హర్యానా
హర్యానాలోని సోనిపట్ సిక్కా కాలనీలో తల్లి ఒడిలో ఉన్న ఆరు నెలల పసికందుపై పెంపుడు కుక్క ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మహిళ పొరుగింటి వ్యక్తితో మాట్లాడుతుండగా గేట్ తెరుచుకుని బయటకు వచ్చిన కుక్క చిన్నారిపైకి దూకింది. ఈ ప్రమాదంలో కిందపడిన పాపను స్థానికులు కర్రలతో తరిమి విడిపించి ఆస్పత్రికి తరలించారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.