హైదరాబాద్లో పేదల రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేస్తున్న భారీ ముఠా గుట్టురట్టు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
హైదరాబాద్లో పేదల రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి బ్రాండెడ్ పేర్లతో విక్రయిస్తున్న ముఠాను సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కర్మన్ ఘాట్ ప్రాంతంలో దాడులు నిర్వహించి భారీ ఎత్తున బియ్యం బస్తాలు, ప్రాసెసింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద కఠిన కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.