అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ బాధితుల ఆవేదన
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం.కూసుమంచి మండలంలోని కేసవాపురం గ్రామానికి చెందిన బాధితులు మందపల్లి శ్రీనివాసరావు, రజనీ, రాధాకృష్ణ ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి కూసుమంచి ఎస్సైపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ భూమిలోకి వచ్చి కొందరు గొడవ చేసినా పోలీసులు పట్టించుకోకుండా, తమపైనే అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వాపోయారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.