లంకలపాలెంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని లంకలపాలెం 106వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎక్స్ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పింఛన్దారుడు మరణిస్తే వెంటనే భార్యకు పింఛన్ మంజూరు చేయడం హర్షనీయమని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు.