పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యుల అక్రమ అరెస్టులు
రిపోర్టర్: శివ
స్థలం: Pakistan
పాకిస్తాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులను అధికారులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. సెప్టెంబర్ 27న తలపెట్టిన నిరసన మార్చ్ నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కాసిమ్ ఖాన్ తన అత్తలు డాక్టర్ ఉజ్మ, నౌరీన్ తో పాటు కజిన్స్ షెర్షా, షహ్రేజ్, అజీమ్, సకీనాల గృహాలపై అధికారులు దాడి చేసి బలవంతంగా అపహరించారని ఆరోపించారు. ఎటువంటి కారణాలు చెప్పకుండా, ఎక్కడికి తీసుకెళ్లారో తెలపకుండా పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.