వినాయక నిమజ్జనంలో అధిక డీజే శబ్దాలను నియంత్రించాలి
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, ఆనందకరంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీసులు పిలుపునిచ్చారు. పండుగ మనదే అయినప్పటికీ బాధ్యత కూడా అందరిపై ఉంటుందని స్పష్టం చేశారు. నిమజ్జన సమయంలో అధిక డీజే శబ్దాలను పూర్తిగా నివారించి, నిబంధనలు పాటించాలని ప్రజలకు, యువతకు విజ్ఞప్తి చేశారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో శాంతియుతంగా వేడుకలు ముగించాలని కోరారు.