గోవా డ్రగ్స్ గుట్టురట్టు: హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
తెలంగాణలో మత్తు పదార్థాల సరఫరాను అణచివేసేందుకు రాష్ట్ర ఈగల్ ఫోర్స్ మరో భారీ నెట్‌వర్క్‌ను బద్దలుకొట్టింది. గోవా కేంద్రంగా హైదరాబాద్‌కు సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన కింగ్‌పిన్ కస్టోడియో ఫెర్నాండెజ్ అలియాస్ క్రిస్టీని గోవాలో అరెస్ట్ చేసినట్లు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. హెచ్-న్యూ, పంజాగుట్ట పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు, తెలంగాణకు చెందిన ఇరవై ఐదు మంది కొనుగోలుదారుల జాబితాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.