ఆయుష్మాన్ భారత్ తో ప్రజలకు మెరుగైన వైద్యం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో ఆయుష్మాన్ భారత్ పథకం వైద్య రంగాన్ని మరింత సులువుగా మరియు డిజిటల్ మయం చేస్తోందని కేంద్రం తెలిపింది. పీఎంజేవై లబ్ధిదారులలో దాదాపు యాభై శాతం మంది మహిళలే ఉండగా, తొంబై నాలుగు కోట్లకు పైగా అభా ఐడీలు, వంద కోట్లకు పైగా ఆరోగ్య రికార్డులు అనుసంధానించబడ్డాయి. అలాగే ఆరు కోట్ల మందికి పైగా సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది.