దారుణం: భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్

రిపోర్టర్: మహేష్ స్థలం: కొత్తగూడెం

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసి గోదావరిలో పడేసిన ఘటన కొత్తగూడెం జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించిందని పోలీసులు తెలిపారు. టేకులపల్లికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్ సోషల్ మీడియా ద్వారా పరిచయమైన భవానిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య కనిపించడం లేదంటూ స్టేషన్ లో నాటకామాడిన నరేందర్ బాగోతం బట్టబయలు కావడంతో, బూర్గంపాడు సమీపంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.