నా జీవితంలో ఒకే ప్రేమకథ ఉంది: దర్శకుడు జాసన్ సంజయ్ వెల్లడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: చెన్నై

తన వ్యక్తిగత జీవితంపై దర్శకుడు జాసన్ సంజయ్ కీలక విషయాలు వెల్లడించారు. కాలేజీ రోజుల్లో తనకు ఒకే ఒక ప్రేమకథ ఉండేదని, ఏడాదిన్నర పాటు సాగిన ఆ బంధం పరస్పర అంగీకారంతో ముగిసిందని ఆయన తెలిపారు. విదేశాల్లో చదువుతున్న సమయంలో దూరం పెరగడంతో విడిపోయామని పేర్కొన్నారు. బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు సినిమాలపై పూర్తి దృష్టి పెట్టానని, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.