అటవీ ప్రాంతంలో అదృశ్య వ్యక్తి శవమై లభ్యం
రిపోర్టర్: అశోక్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం రాపూరు మండలం తెగచర్ల అడవిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన వీరపురెడ్డి నారాయణరెడ్డి శనివారం అటవీ ప్రాంతంలో శవమై కనిపించారు. ఈ నెల 8న పొలానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశువుల కాపరుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.