గంభీరావుపేట కేజీ టూ పీజీ స్కూల్‌లో విద్యార్థుల క్యూ కష్టాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట కేజీ టూ పీజీ పాఠశాలలో కనీస సౌకర్యాల కొరత వేధిస్తోంది. కోట్లు ఖర్చు చేసినా, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా వాష్‌రూమ్‌లు లేకపోవడంతో చిన్నారులు క్యూ కట్టాల్సి వస్తోంది. వెస్ట్రన్ టాయిలెట్ల వినియోగంపై అవగాహన లేక, నీటి సమస్యతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రతతో అనారోగ్యానికి గురవుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.